శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (17:00 IST)

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న చిత్రం భైరవం

Bellamkonda Sai Srinivas- Bhairavam
Bellamkonda Sai Srinivas- Bhairavam
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ “భైరవం” టైటిల్ తో రూపొందుతున్న మూవీ ఫస్ట్ లుక్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ ఆయన్ని రగ్గడ్ అండ్ రస్టిక్ గా ప్రజెంట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం, ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారని ఫస్ట్ లుక్ పోస్టర్ సూచించింది.
 
శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కెకె రాధామోహన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 16కి పవర్ ఫుల్ 'భైరవం' అనే టైటిల్ పెట్టారు. టైటిల్ డిజైన్ విశేషంగా ఆకట్టుకుంది. భైరవంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. మనోజ్ మంచు, నారా రోహిత్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఒకదాని తర్వాత ఒకటి త్వరలో విడుదల కానున్నాయి.
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ స్క్రీన్‌ను షేర్ చేసుకోడం సినీ అభిమానులకు కన్నుల పండగలా వుండబోతోంది.  
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.
 
మేకర్స్ రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌ లని అందించనున్నారు.  
 
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్