గురువారం, 11 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (10:23 IST)

Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ సీజన్ 9- హౌస్‌లోకి శ్రష్ఠి వర్మ.. ఇంకా ఎవరంటే?

Bigg Boss Season 9
Bigg Boss Season 9
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా శ్రష్ఠి రాణిస్తోంది. వరుస సినిమా సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేస్తూ రోజు రోజుకీ బిజీగా మారుతోంది. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్ని రోజులు వర్క్ చేసింది.
 
ఇకపోతే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సోనియా సోనియా సాంగ్‌తో నాగార్జున డ్యాన్స్ అదరగొట్టారు. ఇటీవల ఈ పాట తమిళంలో ట్రెండ్ అయ్యింది. నాగార్జున ఫస్ట్ హౌస్‌లోకి వెళ్లారు. కళ్లకు గంతలు కట్టుకుని లోపలికి వెళ్లి అంతా చూశారు. 
 
ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ ఉండనుందని నాగార్జున అన్నారు. అయితే ఈసారి రెండు బిగ్ బాస్ హౌస్‌లు ఉన్నాయి. ఈ రెండు హౌస్‌లు అయితే అదిరిపోయాయి. ముఖ్యంగా కెప్టెన్ హౌస్ అయితే అదిరిపోయింది. ఇక Bigg Boss 9 హౌస్‌లోకి ఈ సారి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు.
Bigg Boss Season 9
Bigg Boss Season 9
 
వారిలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ కింద.. తనూజ, ఆశాషైనీ, సంజనా గల్రానీ, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, శ్రేష్ఠ వర్మ, భరణి శంకర్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన.. మాస్క్ మెన్ హరీష్, సోల్జర్ పవన్ కల్యాణ్, శ్రీజ దమ్ము, మర్యాద మనీష్, ప్రియా శెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రెటీలు కాగా.. మరో 6గురు సామాన్యుల్ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఇలా ఈ 15 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు 15 వారాలు బీభత్సం సృష్టించబోతున్నారు.