శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (09:47 IST)

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

chiranjeevi iifa award
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వరించింది. ఈ అవార్డును సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అబుదాబీ వేదికగా జరిగిన ఐఐఎఫ్ఏ-2024 వేడుకల్లో భాగంగా, రెండో రోజు కార్యక్రమంలో హీరోయిన్ సమంత, రానా, ఏఆర్ రెహ్మాన్, వెంకటేశ్, బాలకృష్ణ తదితరులు హాజరై సందడి చేశారు. అలాగే, టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. 
 
ఈ వేడుక‌ల్లో చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ అవార్డును బాలీవుడ్ సినీ ప్రముఖుడు జావెద్ అక్తర్ నుంచి ఆయన స్వీకరించారు. 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా' పుర‌స్కారం అందుకున్నారు. అలాగే, 'ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు'ను హీరోయిన్ సమంత గెలుచుకున్నారు. ఎవరెవరు ఏ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నారంటే..
 
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా -  చిరంజీవి
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా - ప్రియదర్శన్‌
వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ - సమంత
గోల్డెన్‌ లెగసీ అవార్డు - బాలకృష్ణ
ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ) - రిషబ్‌ శెట్టి
ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్‌
ఉత్తమ నటుడు (తెలుగు) - నాని 
ఉత్తమ నటుడు (తమిళం) - విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ విలన్‌ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
ఉత్తమ విలన్‌ (తెలుగు) - షైన్‌ టామ్‌ (దసర)
ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం - జైలర్‌ (హుకుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ నేపపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
ఉత్తమ విలన్‌ (మలయాళం) - అర్జున్‌ రాధాకృష్ణన్‌