పైరసీ వచ్చినా తండేల్ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు
తండేల్ సినిమా పందకోట్ల క్లబ్‌కు చేరిందనీ, నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌కు చందుమొండేటి దర్శకత్వం తోడయిందని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిన్ననే ప్రకటించారు. పైరసీనికూడా తట్టుకుని వందకోట్ల క్లబ్‌కు చేరడం ఆనందంగా వుందని ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా వుండగా అల్లుఅరవింద్ సమక్షంలో బేబి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ఛానల్ మీడియాపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కొన్ని పైరసీ వెబ్‌సైట్లలో ప్రింట్ వచ్చిందనీ, ఈరోజు కాపీ వచ్చేసిందోచ్. అంటూ పబ్లిష్ చేస్తున్నారు. ఇది మైయిన్ స్ట్రీమ్ కు సంబంధించిన వెబ్ సైట్ లో కూడా వార్త వచ్చేసిందోచ్. అనడంతో పాటు ఆహా, అమెజాన్ లో వచ్చేసింది.. చూడొచ్చు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు అని అల్లు అరవింద్ సమక్షంలో చెబుతున్నాను. ఇలా వార్తలు రాసినవారే నైతిక భాద్యత వహించాలి అన్నారు.
ఇక, .తండేల్ కు మిక్సెడ్ టాక్ వచ్చిందనేది తెలిసిందే. ఈ సినిమాను వందకోట్ల క్లబ్ కు చేరేలా చేయాలనే పట్టుదలతో చిత్ర టీం వున్నట్లు తెలిసిందే.