మంగళవారం, 4 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2025 (13:46 IST)

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Rajendra Prasad, Prithviraj, Kedar Shankar, Manichandana
Rajendra Prasad, Prithviraj, Kedar Shankar, Manichandana
ప్రేయసి రావే తొలి చిత్రంతోనే దర్శకునిగా తన సత్తా చాటుకున్నారు మహేష్‌ చంద్ర. ఆ తర్వాత అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారాయన. తాజాగా మహేష్‌ చంద్ర రూపొందించిన చిత్రం పిఠాపురంలో. దీనికి ఉప శీర్షిక అలా మొదలైంది. డా. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది.

మహేష్‌ చంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 
 
మహేష్‌చంద్ర మాట్లాడుతూ - కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథ ఇది. ఇందులో మూడు జంటల ప్రేమకథలు చూడొచ్చు. ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లనీ చూడొచ్చు. ప్రేక్షకులు ఏదో ఒకరకంగా ఈ కథతో కనెక్ట్‌ అవుతారు. ఈమధ్య కాలంలో ‘పిఠాపురం’ అనేది ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ పిఠాపురం నేపథ్యంలోనే సినిమా అంతా సాగుతుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 28 రోజులు, హైదరాబాద్‌లో 15 రోజులు, గోవాలో 6 రోజులు చిత్రీకరణ జరిపాం. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. పాటలు చాలా బాగా వచ్చాయి. గోవాలో ఒక పాటను, హైదరాబాద్‌లో సెట్‌వేసి ఇంకో పాటను, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్‌లో మరో పాటను చిత్రీకరించాం. దర్శకునిగా నాకు జీవితాన్ని ప్రసాదించిన ‘మూవీమొఘల్‌’ డి. రామానాయుడు గారి స్ఫూర్తితో కథను నమ్మి, ఎక్కడా వేస్టేజ్‌ లేకుండా ఈ సినిమా తీశాం. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని తెలిపారు.
 
డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. 
 
ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్,  స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ,