శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (10:36 IST)

చైతూ సమంతతో విడాకులు తీసుకోలేదా.. శోభితను నిశ్చితార్థం చేసుకోలేదా?

divvela madhuri
దివ్వెల మాధురి పేరు మారుమోగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్‌తో ఆమె సాగించిన అక్రమ సంబంధం గురించి మీడియా కోడై కూస్తోంది. దువ్వాడతో కలిసి జీవించడంపై ఆయన కుమార్తెలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగ చైతన్యను ఉద్దేశించి దివ్వెల మాధురి చేసిన కామెంట్స్ ట్రోల్స్‌కు దారితీసింది.
 
తాజా ఇంటర్వ్యూలో, అప్పటికే పెళ్లయిన వ్యక్తితో కలిసి జీవించడం బాధగా అనిపించలేదా అని అడిగినప్పుడు, దివ్వెల బదులిస్తూ "అందులో తప్పేముంది. పెళ్లయిన జంటలందరూ కలిసి జీవిస్తున్నారా? ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత విడిపోలేదా? నాగ చైతన్య మరొకరితో (శోభితా ధూళిపాళ) నిశ్చితార్థం చేసుకోలేదా?" అనే 
మాధురి వాదన చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.