గురువారం, 3 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 2 జులై 2025 (17:43 IST)

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Naveen Chandra
Naveen Chandra
అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు. 
 
ఈ మేరకు షో టైమ్ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనే ప్రశ్నకు నవీన్ చంద్ర సమాధానం చెప్పారు. డైరెక్టర్ మదన్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక ఫ్యామిలీలో తక్కువ క్యారెక్టర్ల నడుమ సాగే ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రతీ అంశం ప్రేక్షకుడిని రంజింప చేస్తుంది అన్నారు.
 
Naveen Chandra,  Kishore Garikipati, Raja Ravindra
Naveen Chandra, Kishore Garikipati, Raja Ravindra
పోలీసు ఆఫీసర్ కామెడీనా? స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే క్యారెక్టర్ యాక్టర్ రాజా రవింద్ర మాట్లాడు.. ఇందులో చాలా మంచి పోలీసు క్యారెక్టర్ చేశాను అన్నారు. అయితే క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందన్నారు.
 
ఆఫీసర్ లుక్ కోసం తీసుకున్న జాగ్రత్తలు గురించి మాట్లాడుతూ.. పెద్దగా కష్టపడలేదు కానీ ఫిట్ నెస్ మేయింటైన్ చేసినట్లు చెప్పారు. ఇదే ప్రశ్నకు హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. రాజా రవింద్రది ఒక విచిత్రమైన పర్సనాలిటీ అని ఆయన పాత్రలో ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తారు. అందిరిలా మెథడ్ యాక్టింగ్ ఫాలో కాడు... అందరితో నవ్వుతూ.. నవ్విస్తూ.. సరదగా ఉంటాడు.. ఆయన షాట్ రెడీ అవగానే స్ట్రిక్ట్ గా మారిపోతాడు అని చెప్పారు.
 
ఇలాంటి జోనర్స్ మలయాళంలో ఎక్కువగా వస్తాయి.. తెలుగులో వర్కౌట్ అవుతాయా? అంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి చెప్పారు.
 
దృశ్యం సినిమాలా అనిపించింది.. ఇది కూడా ఫ్యామిలీని కాపాడే కథే కదా అనే ప్రశ్నకు.. డైరెక్టర్ సమాధానం చెబుతూ.. అంత పెద్ద సినిమాతో పోల్చడం సంతోషంగా ఉంది కానీ ఇది దృశ్యం సినిమాకు భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ చూసి ఇదే సినిమా ఫిక్స్ అవకండి... సినిమా చాలా కొత్తగా, చాలా ఆసక్తిగా ఉంటుందన్నారు.
 
షో టైమ్ అని టైటిల్ పెట్డడానికి కారణం ఏంటి? అని మీడియా ప్రశ్నకు.. ఈ సినిమా చూసిన తరువాత ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులే అంటారు. ఇది కచ్చితంగా షో టైమ్ అని చెప్పారు.
 
ఎక్కువగా థ్రిల్లర్ జోనర్లే ఎందుకు ఎంచుకుంటున్నారు అని నవీన్ చంద్రను ప్రశ్నించగా.. ఒకే రకమైన సినిమాలు చేయాలని ఎవరికి ఉండదు.. కానీ ఇది సీరియస్ ఇన్విస్టిగేషన్ సినిమా కాదు.. ఇందులో ప్రేక్షకులను ఆకర్షించే అనేక అంశాలు ఉన్నాయి అని చెప్పారు.
 
స్క్రిప్ట్స్ సెలెక్షన్స్ చాలా బాగుంటాయి కదా... ఏమైన జాగ్రత్తలు తీసుకుంటారా అంటే.. కచ్చితంగా మంచి స్క్రీప్ట్ ను ప్రేక్షకులకు అందించాలనే తపన ఉంటుంది అని హీరో నవీన్ చంద్ర చెప్పారు.  
 
నరేష్ లాయర్ గా చేశారు, రాజా రవింద్ర పోలీసుగా చేశారు కదా.. వీరిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయి అంటే.. వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. థియేటర్లో వీరి కాంబినేషన్ వచ్చినప్పుడు నవ్వులే నవ్వులు.. ఇంకో రెండు రోజుల్లో ఆ మ్యాజిక్ చూస్తారు కదా అంటూ హీరో సమాధానమిచ్చారు.
 
విడుదలైన ట్రయిలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుడిని థియేటర్లో కట్టిపడేసి, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసే అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉందని తెలుస్తుంది. షో టైం మూవీ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.