శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (20:22 IST)

ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. చితక్కొట్టుకున్న అభిమానులు

Prabhas
మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో అభిమానుల్లో చితక్కొట్టుకున్నారు. ప్రభాస్ పుట్టిన రోజును ఫ్యాన్స్ అనేక విధాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ చోట ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో గొడవపడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. 
 
భీమవరంలో ప్రభాస్‌కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతీ యేటా అక్కడ ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతాయి. ఈ యేడాది కూడా ఫ్యాన్స్ అలానే ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవైంది. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్‌లోని సాహూ, వాసు అనే రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. 
 
దాడుల్లో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గత రాత్రి ఈ గొడవ జరిగింది. ప్రభాస్ బర్త్‌ డే రోజు సాహు వర్గం భీమవరంలో భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సాహో వర్గం ఫేక్‌ ఫ్యాన్స్‌ అంటూ జిల్లా ప్రభాస్‌ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వాసు కామెంట్స్‌ చేశారు. తమ హీరో బర్త్ డే సెలెబ్రేషన్స్ పేరు చెప్పి, సాహు వర్గం డబ్బులు వసూలు చేసిందని వాసు కొద్దిరోజుల క్రితం‌ ఆరోపించారు. సాహుకు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు ఏమి సంబంధం లేదని పెర్కొన్నారు. 
 
దీంతో వాసు వర్గం.. సాహో వర్గంపై దాడికి దిగింది. మార్కెట్ యార్డులో నిర్వహించే వాసు వేడుకలను అడ్డుకునేందుకు సాహు వర్గం ప్రయత్నించింది. దీంతో సెలెబ్రేషన్స్ జరగాల్సిన చోట తన్నులాటలు జరిగాయి. ప్రభాస్ సొంత ఊరిలో ఈ గొడవ జరగటం వివాదాస్పదమవుతోంది.