శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (11:28 IST)

బాలయ్యా నేను రెడీ... మరి మీరు: మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ (video)

Chiru-Balayya
యువరత్న నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ప్రత్యేక ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బాలయ్య ఇదే ఎనర్జీతో ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు.
 
మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా కావాలని చాలామంది కోరుతుంటారు. ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమర సింహారెడ్డి స్టామినా వున్న కథతో ఎవరైనా దర్శకులు మా ముందుకు కథతో వస్తే నేను రెడీ. మరి బాలయ్య మీరు రెడీయేనా అన్నారు. వెంటనే బాలయ్య కూడా నేను రెడీ అనేశారు. వెంటనే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... దర్శకులకు ఇదే ఛాలెంజ్. అంత శక్తివంతమైన కథతో వస్తే నటించేందుకు మేమిద్దరం సిద్ధం అని అన్నారు మెగాస్టార్.