శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (15:52 IST)

నాకు బద్ధకం ఎక్కువ - లాశణ్యతో స్పర్థలు సమసినట్లే !

Raj tarun lunge punche
Raj tarun lunge punche
నటుడు రాజ్ తరుణ్ ఈ మధ్య హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈడో రకం ఆడోరకం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని రాజ్ తరుణ్ ఈ ఏడాది సంక్రాతికి నాగార్జునతో కలిసి నా సామి రంగ చేసిన చిత్రం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆరునెలల గేప్ లో ఒకేసారి మూడు సినిమాలు ఫటాఫటా విడుదలకావడం జరిగింది. దానితోపాటు ఆయనతో సహజీనం చేస్తున్న లావణ్య తనను మోసం చేశాడని ఒకరకంగా నమ్మించి మోసం చేశాడని మీడియా ముందు వాపోయింది.
 
ఈ సందర్భంగా ఆయన సహజీనం ఎపిసోడ్ డైలీ సీరియల్ గా రోజుకో కథ ప్రచారంలో వుంది. అలాంటిది ఒక్కసారిగా ఆగిపోయింది. ఇదే విషయం ఆయన్ను ఈరోజు భలేవున్నాడే సినిమా ప్రమోషన్ లో మీపై కాంట్రవర్సీ ఎందుకు ఆగిపోయింది? లావణ్యతో సర్దుబాటు చేసుకున్నారా? ఇంకేమైనా చేశారా? అని అడిగితే.. అలాంటిది ఏమీ లేదండి..  అలా జరిగింది. అని ముక్తసరిగా సమాధాన చెప్పారు. 
 
ఈ లావణ్య ఎపిసోడ్ లో వుండగానే పలుసార్లు సినిమాల ప్రమోషన్లలో లుంగీపంచె కట్టుకుని వచ్చేవారు. ఇదేమైనా సెంటిమెంటా? లేదా? కారణం ఏమైనా వుందని అడిగితే.. అదేమి లేదండి. ఏదో డ్రెస్ వెయ్యాలంటే ఏ కలర్ వేసుకుంటే ఏది బాగుంటుంది.. అనే డైలమాలో చాలాసార్లు జరిగింది. అందుకే సరదాగా పంచె కడితే బాటుంటుందని అనిపించింది. సహజంగా నాకు బద్ధకం ఎక్కువ. అందుకే లుంగీ పంచె అయితే ఈజీగా వుంటుందని సమాధానమిచ్చాడు.