మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2025 (07:09 IST)

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

NTR, Pragathi Shetty, Rishabsetty, Chaluve Gowda
NTR, Pragathi Shetty, Rishabsetty, Chaluve Gowda
కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
ఎన్టీఆర్ మాట్లాడుతూ... మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు నుంచే కొన్ని కథలు చెప్పడం మొదలు పెట్టింది. అప్పుడు నిజంగా  జరుగుతుందా ఈ కథ నిజమేనా కాదా ? ఇలా ఎన్నో డౌట్లు. కానీ అవి బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది.  ఆ పింజుల్లి, గుడి ఘాట్ చిన్నప్పుడు నుంచి నాటుకు పోయింది. కానీ ఏనాడు అనుకోలేదు. చిన్నప్పుడు నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు సినిమా తీస్తాడని. అతను మరెవరో కాదు నా బ్రదర్ రిషబ్ శెట్టి. నేను చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే అంత ఆశ్చర్య పోతే ఆ కథ తెలియని వాళ్ళు చూసి ఏమయ్యారో అదే కాంతార రిజల్ట్. చాలా అరుదైన దర్శకుడు రిషబ్. 24 క్రాఫ్ట్ లో అన్ని క్రాఫ్ట్స్ ని ఆయన డామినేట్ చేయగలరు. రిషబ్ గారే లేకపోతే నిజంగా ఈ సినిమాని ఈ లెవెల్ లో తీయగలిగేవారా అనిపిస్తుంది. 
 
ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్లాలని మా అమ్మ కోరిక. రిషబ్  లేకపోతే ఆ దర్శనం అలా అయ్యేది కాదు. ఆ భాగ్యం కలిగేది కాదు. పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యులు లాగా మాతో వచ్చారు.  సొంత కుటుంబ సభ్యులు లాగా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు కాంతార చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది. ఈ సినిమా  తీయడం అంత ఈజీ కాదు. ఒక గుడికి తీసుకెళ్లారు. నిజానికి ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి గారి డ్రీమ్. ఈ డ్రీమ్ ని ఫుల్ ఫిల్  చేయడానికి హోంబలే ఫిల్మ్స్ సపోర్ట్ చేశారు. 
 
ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఈ చిత్రం ప్రస్ఫుటంగా కనబడాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన రిషబ్ గారిని కాంతారా టీం ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనస్పూర్తిగా నా ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ కూడా ఉంటే బాగుండేది. ఈ సినిమా బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అక్టోబర్ 2న తప్పకుండా ధియేటర్ కి వెళ్లి చూడండి. దయచేసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. మా రిషబ్ గారికి ఆయన పడిన కష్టానికి మీరందరూ ఆశీర్వాదం అందించండి. అందరికీ థాంక్యు.
 
హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు ఫ్రెండు, బ్రదర్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్ తో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ వేడుక హైదరాబాదులో జరుపుకోవడం, ఈ వేడుకకు ఎన్టీఆర్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్ కి  హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకి వచ్చిన ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి మీరందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.  
 
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ... ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడే సినిమా చూడాలనే  ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూసిన ఒకరిద్దరూ ఎక్స్ట్రార్డినరీ సినిమా అని చెప్పారు. వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో చాలా పెద్ద నెంబర్స్ కలెక్ట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. రుక్మిణి  ఎన్టీఆర్ గారితో మేము చేస్తున్న సినిమాల్లో కూడా హీరోయిన్. హోంబలే ఫిలింసు ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీస్తున్నారు. ఎన్టీఆర్ గారు రిషబ్ గారు బ్రదర్స్ లాగా ఉంటారు. ఎన్టీఆర్ గారితో చేస్తున్న సినిమా  వేరే లెవల్.  ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యు సో మచ్.