శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (15:05 IST)

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

Samantha
Samantha
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకుంటోంది. అయితే, ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్‌ తీసుకున్న విషయం తెలిసిందే. అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ క‌థానాయిక‌ల‌లో సమంత ముందు వరుసలో వుంటుంది. 
 
పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత.. విడాకులు అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించడం ఆపలేదు. కెరీర్ పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిదని సమంత అందరిచే ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 
Samantha
Samantha
 
2024 సంవత్సరానికి గాను "వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు"ను సమంత కైవసం చేసుకుంది. సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక (IIFA Utsavam) అబుదాబి (Abu Dhabi) వేదికగా ఘనంగా జరుగుతోంది.
 
ఈ ఈవెంట్‌లో భాగంగా రెండో రోజు స్టార్‌ నటులు సమంత, రానా, వెంకటేశ్‌, బాలకృష్ణ, చిరంజీవి స్పెష‌ల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకల్లోనే సమంతను నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక "వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు"తో సత్కరించారు.
 
ఇక ఈ వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఫా 2024కు గాను ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా’ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. 
Samantha
Samantha
 
మ‌రోవైపు ఉత్తమ చిత్రం విభాగంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన "జైల‌ర్" సినిమాకు అవార్డు ద‌క్కగా.. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో "ద‌స‌రా" సినిమాకు నాని అవార్డు అందుకున్నారు. 


Samantha
Samantha