మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (10:08 IST)

'పుష్ప-2' ట్రైలర్‌లో అరగుండుతో కనిపించే నటుడు ఎవరబ్బా?

tarak ponnappa
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం "పుష్ప-2". వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను గత ఆదివారం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. అయితే, ఈ ట్రైలర్‌లో అరగుండు పాత్రధారి ఒకరు కనిపిస్తున్నారు. ఈ పాత్రను పోషించిన నటుడు ఎవరబ్బా అంటూ ముమ్మరంగా చర్చ సాగుతుంది. ఆ పాత్రను పోషించిన నటుడు పేరు తెలుసుకునేందుకు మూవీ లవర్స్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో విస్తృతంగా శోధిస్తున్నారు. 
 
చివరకు అతనిపేరు తెలిసింది. ఆయన ఎవరో కాదు.. తారక్ పొన్నప్ప. కన్నడ నటుడు. కేజీఎఫ్, దేవర వంటి చిత్రాల్లో నటించారు. ఇపుడు పుష్ప-2లో పొన్నప్ప పుష్పరాజ్‌కు రెండో అన్నయ్య మొల్లేటి ధర్మరాజ్ పాత్రను పోషించినట్టు తెలుస్తుంది. పుష్ప లైఫ్‌ను మార్చేసే పాత్ర అని తారక్ తన క్యారెక్టర్ గురించి వెల్లడించారు. 
 
ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాలో నెగెటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్‌లో నా రోల్ ఉంటుంది. పుష్పరాజ్ క్యారెక్టర్‌ని మలుపు తిప్పే పాత్రలో నటించాను అని వెల్లడించారు. దీంతో సినీ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.