శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (19:12 IST)

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

Kiara Advani
Kiara Advani
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రం టీజర్ ను  ఈనెల  9వ తేదీన దాదాపు 11 ప్రాంతాల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నేడు నాయిక కియారా అద్వానీ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి 2025 జనవరి 10న విడుద‌ల కానుంది.
 
హీరోయిన్ కియారా అద్వానీ మోడ్రన్ ఔట్ ఫిట్ లో కనిపిస్తోంది.  "గ్లోబల్ స్టార్ మ్యాజిక్ అండ్ బ్యూటిఫుల్ కియారా అనుభూతి పొందేందుకు ఇక ఒక్క రోజే ఉంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  శ‌నివారం ఈ సినిమా టీజర్ ల‌క్నో వేదిక‌గా సన్నాహాలు చేశారు. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్ర ఖ‌ని త‌దిత‌రులు నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఇక ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ నిర్మిస్తోంది.