శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (14:19 IST)

షారూక్ ఖాన్‌కు బెదిరింపులు... ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు

sharukh khan
బాలీవుడ్ అగ్ర నటుడు షారూక్ ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా కూడా రూ.50 లక్షలు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని మహ్మద్ ఫైజాన్ ఖాన్‌ అనే ఓ న్యాయవాదిగా గుర్తించారు. 
 
ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌‌లోని రాయ్‌పూర్‌లో గల నివాసంలో అతడిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఐదు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి నేరుగా ముంబై పోలీసుల‌కే బెదిరింపు కాల్ వ‌చ్చింది. బాంద్రా పోలీసు స్టేష‌న్‌లో దీనిపై కేసు న‌మోదు చేసి లోతుగా విచారణ చేపట్టి ఫోన్ చేసింది ఫైజాన్ ఖాన్‌గా గుర్తించారు. దీంతో ఆయనపై భార‌త న్యాయ సంహిత‌లోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద పోలీసులు కేసును న‌మోదు చేసి అరెస్టు చేశారు. 
 
అయితే, ఆ బెదిరింపు కాల్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ నెల 2వ తేదీనే తాను ఫోన్ పోగొట్టుకున్నానని ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన నంబర్ నుంచి బెదిరింపు కాల్ చేయడం వెనుక ఏదో కుట్ర దాగివుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాదు, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు కారణమయ్యారంటూ షారూక్‌పై బాంద్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. షార్‌కు వచ్చిన బెదిరింపు కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆయన వాపోతున్నాడు.