సోమవారం, 17 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2025 (10:59 IST)

Naga vamsi: లోక చాప్టర్ 1: షోలు రద్దు కావడం వల్ల నిర్మాత నాగ వంశీకి లాభమా నష్టమా?

Loka Chapter 1: Chandra booking poster
Loka Chapter 1: Chandra booking poster
సితార ఎంటర్ టైన్ మెంట్ అనగానే అగ్ర నిర్మాణ సంస్థ. నాగవంశీ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించి సక్సెస్ సాధించారు. ఇక ఇటీవలే వార్ 2 సినిమాను తెలుగులో విడుదలచేశారు. కానీ ఆశించినంత ప్రతిఫలం రాలేదు. దాంతో సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వెలువడ్డాయి. తాజాగా ఆయన దుల్కర్ సల్మాన్ మలయాళంలో నిర్మించిన లోకా చాప్టర్-1 ను తెలుగులో విడుదలచేస్తున్నారు.
 
ఈ చిత్రం ఈరోజు అనగా ఆగస్టు 29న విడుదల కావాల్సింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ షడెన్ గా నిన్న సాయంత్రం నుంచే షో రద్దు అయినట్లు నిర్మాత ప్రకటించారు. కానీ సాంకేతికరమైన అంశాలు వున్నట్లు తెలుస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ నటించిన చిత్రం 'లోకా చాప్టర్ 1: చంద్ర' మలయాళంలో మంచి సమీక్షలను అందుకుంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.
 
తెల్లవారుజామున ప్రదర్శనలు క్లుప్తంగా టికెటింగ్ పోర్టల్స్‌లో కనిపించాయి కానీ కొన్ని పరిష్కారం కాని సమస్యల కారణంగా త్వరగా తొలగించబడ్డాయి. థియేటర్లలో ప్రదర్శనలు గురించి మరోసారి తెలియజేస్తామని తెలియజేశారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నాగ వంశీ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీని నిర్వహిస్తున్నారు, ప్రారంభ ప్రదర్శనతోనే అభిమానులను నిరాశపర్చడం పట్ల సినిమాకు లాభమా నష్టమా అనే చర్చ వినిపిస్తోంది. దీనికి జేక్స్ బెజోయ్ దీని సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు.