శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

KalyaniPriyadarshan
మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం 'లోకా: చాప్టర్-1'. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. కల్యాణి ప్రియదర్శ‌న్‌‍తో పాటు నెక్లెన్, శాండీ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రం విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందని చెప్పుకుంటున్నారు. 
 
జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం గమనార్హం. 
 
ప్రస్తుతం ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే, రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదని సినీ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కల్యాణి ప్రియదర్శన్ ఇంతవరకూ 15 సినిమాలు చేసినప్పటికీ, అసలైన హిట్ ఈ సినిమాతోనే పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది మరో హిట్‌ను తాన ఖాతాలో వేసుకుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.