శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (17:42 IST)

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

Mahakumbha Mela 2025 Shreyas Media poster
Mahakumbha Mela 2025 Shreyas Media poster
ప్రమోషనల్ ఏజెన్సీగా ప్రఖ్యాతిగాంచిన శ్రేయాస్ మీడియా మరో అద్భుతమైన కార్యక్రమంలో భాగంకానుంది. దక్షిణ భారతదేశం నుండి తమ పయనాన్ని మొదలుపెట్టిన శ్రేయాస్ మీడియా.. ఇప్పుడు అమెరికా, కెనెడా, దుబాయ్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలోనూ జయకేతనాన్ని ఎగురవేశ దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 15 సంవత్సరాల నిరంతర కృషికి ఆ మహాపరమేశ్వరుడు అందించిన మహా కానుకగా.. ప్రపంచవ్యాప్త హిందువుల విశిష్టమైన పుణ్యస్థలం ప్రయాగ్ రాజ్ లో ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళ 2025 అడ్వర్టయిజింగ్ రైట్స్ ను శ్రేయాస్ మీడియా సొంతం చేసుకుంది.
 
ప్రయాగ్ రాజ్ మేళా అథారిటీ భాగస్వామ్యంతో శ్రేయాస్ మీడియా మహా కుంభమేళాలో బ్రాండ్స్ ను ప్రచారం చేయడానికి హక్కులు సొంతం చేసుకోవడమే కాకుండా, హోర్డింగ్స్, ఎలక్ట్రికల్ పోల్స్, స్టాల్స్, మీడియా వాచ్ టవర్స్, యాక్టివిటి జోన్స్, స్కై బెలూన్స్ తదితర ఇన్నోవేటివ్ యాడ్స్ తో శ్రేయాస్ మీడియా ఈ ప్రసిద్ద పండుగకి మరింత విశిష్టత చేకూర్చనుంది. శ్రేయాస్ మీడియా సౌతిండియా నుంచి జర్నీ మొదలుపెట్టి దేశవ్యాప్తంగా బ్రాండ్ బిల్డింగ్ లో విశ్వసనీయ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఎన్నో ఏళ్లుగా 60 కి పైగా రిటైల్ బ్రాండ్లను విజయవంతంగా అడ్వర్టైజ్ చేసింది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చే ఈ మహా ఉత్సవంలో తమ సంస్థ భాగమవడాన్ని  శ్రేయాస్ మీడియా అదృష్టంగా భావిస్తోంది.