శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:50 IST)

కూతురు అని పిలుస్తూనే నీచంగా ప్రవర్తించాడు.. : మలయాళ నటి సౌమ్య

romance
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఇపుడు అణుబాంబులా విస్ఫోటనం పేలింది. ముఖ్యంగా, జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. తాజాగా మరో మలయాళ నటి సౌమ్య కూడా ఓ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. కుమార్తె అంటూ పిలుస్తూనే నీచానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. 
 
ఒక దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి సౌమ్య ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను బయటపెట్టారు. కూతురని పిలుస్తూనే నీచంగా ఆ దర్శకుడు ప్రవర్తించాడని సౌమ్య బోరున విలపిస్తూ వెల్లడించింది. 
 
18 ఏళ్ల వయసులోనే తెలిసిన వారి ద్వారా తనకు సినిమాలో అవకాశం వచ్చిందని, దర్శకుడు నచ్చజెప్పడంతో తన ఇంట్లో వారు సుముఖత వ్యక్తం చేశారు. మొదటి మీటింగులోనే ఆ దర్శకుడి ప్రవర్తన తనకు నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆయన భార్య ఇంట్లో లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ తంతు దాదాపు యేడాది పాటు కొనసాగింది. అతను తననొక సెక్స్ బానిసగా చేశాడు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయాను. ఆ దర్శకుడు ఎవరు అనేది వెల్లడించలేను. మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం (సిట్) కు మాత్రమే తాను వివరాలు వెల్లడిస్తానని చెప్పింది.