శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (15:05 IST)

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'మంజుమ్మల్ బాయిస్' - రూ.3 కోట్లతో రూ.200 కోట్ల వసూలు!!

Manjummel Boys
ఇటీవల మలయాళంలో వచ్చిన చిత్రం "మంజుమ్మల్ బాయిస్". నస్లెన్ - మమత బైజులు జంటగా నటించిన చిత్రం. కేవలం మూడు కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలైన మొదటి నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.200 కోట్లను వసూలు చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. గిరీశ్ దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లోకి కూడా అనువాదం చేయగా, అక్కడ కూడా హిట్ కొట్టేసి కలెక్షన్లు రాబడుతుంది. 
 
తెలుగులో ఈ చిత్రానికి ప్రేమలు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 8వ తేదీన విడుదల చేశారు. నిజానికి తెలుగులో ఈ చిత్రానికి పెద్దగా ప్రమోషన్స్ లేవు. అయినప్పటికీ ప్రేక్షకుల మౌత్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అన్ని థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతుంది. చాలా థియేటర్లలో ఇంకా ప్రదర్శిస్తున్నారు. పైగా, ఈ మధ్యకాలంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన అనువాద చిత్రంగా ప్రేమలు నిలిచింది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు.