మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 8 జులై 2025 (10:35 IST)

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Pawan- Datta
Pawan- Datta
ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చిత్ర రంగంలోని పలువురు సంతాపం తెలియజేశారు. ఫిలింఛాంబర్ తో పాటు 24 క్రాఫ్ట్ కు చెందిన వారు తమ సంతాపసందేశాన్ని తెలియజేశారు.
 
కాగా, పవన్ కళ్యాణ్ తన సందేశాన్ని ఇలా తెలియజేశారు. శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని ప్రకటన విడుదల చేశారు.

సినిమా రంగానికి అతీతంగా గౌరవనీయమైన సాహిత్యవేత్త అయిన దత్తా రచనలు సాంస్కృతిక గొప్పతనానికి మరియు తాత్విక లోతుకు ప్రసిద్ధి చెందాయి. ఆయన మరణం తెలుగు చలనచిత్ర ప్రపంచాన్ని తీవ్రంగా కదిలించింది, సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.
 
ఆయన మృతికి ఎం.ఎం. కీరవాణి మరియు ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.