Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్
Nara Rohit presenting wedding card to Revanth Reddy
సినీ నటుడు నారా రోహిత్ తన వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వెడ్డింగ్ కార్డ్ అందజేశారు. శుక్రవారంనాడు రేవంత్ ను కలిశారు. ఆయనతోపాటు రోహిత్ కుటుంబీకులు, మంత్రి కూడా వున్నారు. ఈ నెల 30 న నారా రోహిత్ వివాహం శిరీష తో జరగనుంది.
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకల తేదీలు ఫైనల్ అయ్యాయి. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లి కొడుకు వేడుక జరగనుంది.
అక్టోబర్ 28న మెహందీ వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వేడుక ఆనందోత్సవంగా ఉండబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తం అక్టోబర్ 30న రాత్రి 10:35కి హైదరాబాద్‌లో జరగనుంది. మొత్తం వేడుకలు స్టార్‌లతో, సంతోషాలతో మెమరబుల్ ఈవెంట్ గా జరగనున్నాయి.