నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త
చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న హీరోయిన్ నయనతార తన 41వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని ఆమె భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ అత్యంత ఖరీదైన కారును బహుమతిగా అందజేశారు. ప్రతి ఏడాది లగ్జరీ వాహనాలను బహుమతిగా ఇచ్చే విఘ్నేశ్ ఈ సంవత్సరం కూడా అదే ఫాలో అయ్యారు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్‌ను గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పారు. దీని విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని సమాచారం.
గత 2023లో విఘ్నేశ్ నయన్‌కు మెర్సిడెస్ మేబాచ్ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, 2024లో మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600ను బహుమతిగా ఇచ్చారు. ఇది రూ.5 కోట్లు ఉండొచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ యేడాది దాన్ని డబుల్ చేస్తూ రూ.10 కోట్ల గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.