MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు
తెలంగాణ ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు వాట్సాప్‌లో మీసేవా సేవలను ప్రారంభించారు. దీని ద్వారా పౌరులు 38 విభాగాల నుండి 580కి పైగా ప్రభుత్వ సేవలను పొందగలుగుతున్నారు. విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోటీ పరీక్షలకు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర పోటీ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు WhatsApp ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సేవను సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ నంబర్ 8096958096 ద్వారా 24 గంటలూ యాక్సెస్ చేయవచ్చు.
వాట్సాప్ ఆధారిత మీసేవా సేవలను మరింత యాక్సెస్ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో ఈ సర్వీస్‌ను తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.