శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (15:38 IST)

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం

nbk golden jublee celebrations
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ చిత్రపరంగ ప్రవేశం చేసి 50 యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులను తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. 
 
బాలకృష్ణ  సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటో తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో శివ రాజ్ కుమార్, కిచ్చ సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, దునియా విజయ్, దర్శకులు పి.వాసు, నటుడు నాజర్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, హీరోయిన్లు సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలత, రాధిక, రాధ తదితరులు ఉన్నారు. ఈ వేడుకల్లో చిత్రపరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలంతా హాజరుకానున్న విషయం తెల్సిందే.