అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని సినీ హీరోయిన్ నిహారిక అన్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, శ్రీతేజ్ అనే బాలుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో అల్లు అర్జున్‌కు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. కానీ, మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోలు ఒక్కరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు.
ఈ నేపథ్యంలో తాను హీరోయిన్‌గా నటించిన మద్రాస్ కారన్ అనే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న నిహారిక మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని చెప్పారు. మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు. అందరి మద్తుతో అల్లు అర్జున్ ఆ బాధ నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నారని చెప్పారు.
తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుంటుంటామని చెప్పారు. రామ్ చరణ్ అన్నతో ఎంతో సరదాగా ఉంటానని చెప్పారు. లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ప్రతి సినిమాకు ఆయన స్టైల్ మారుస్తుంటారని చెప్పారు.