శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (15:51 IST)

దేవర టికెట్ల పెంపు జీవోపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, దుర్గేష్ కు ధన్యవాదాలు తెలిపిన ఎన్.టి.ఆర్., నాగవంశీ

Devara new
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి దేవర టీమ్ ధన్యవాదాలు తెలిపింది.  ఎన్.టి.ఆర్., నిర్మాత నాగవంశీ తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఎ.పి.లో దేవర సినిమా టికెట్ల రేటుకు జీవో ఏర్పాటు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఈ విషయంలో కాస్త ఆలస్యం చేయడమేకాకుండా కొంత రాద్దాంతం కూడా చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ఎ.పి.లో సినిమారంగ అభివ్రుద్ధికి క్రుషిచేస్తామని హామీ ఇచ్చారు. 
 
పాన్ ఇండియా చిత్రంగా దేవర లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. దర్శకుడు కొరటాల శివ భారీ యాక్షన్ తో కూడిన పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ప్లానింగ్ లు  దేవర కోసం జరుగుతున్నాయి.
 
ఏపీ ప్రభుత్వం జీవో ప్రకారం దేవర కోసం 27 తెల్లవారు 12 గంటలతోనే మొదటి షోస్ కి పర్మిషన్స్ ఇవ్వడంతోపాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు. దీనితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కూడా తారక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.