శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:28 IST)

లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు.. ఫైర్ అయిన పవన్ కల్యాణ్

Pawan kalyan
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా స్పందించారు. అటువంటి పవిత్ర నైవేద్యంలో జంతువుల కొవ్వును ఉపయోగించడం అసంఖ్యాక భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పవన్ పేర్కొన్నారు. 
 
సనాతన ధర్మ పరిరక్షణకు అంకితమైన జాతీయ బోర్డును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పవన్ కళ్యాణ్ నొక్కిచెప్పారు. దేవాలయాల పరిరక్షణ, హిందూ విశ్వాసం గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఇందుకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని, ఈ విషయంలో సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ ప్రకటించారు. 
 
మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదాలపై వచ్చిన ఆరోపణలకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి చెప్పింది అబద్దమైతే వారు తప్పకుండా వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురవుతారని మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.