శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:49 IST)

పవన్ పుట్టినరోజు.. ఓజీ ఫస్ట్ లుక్ సంగతేంటి?

pawan kalyan
బ్రో - అవతార్ జూలై నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రం కొన్ని వారాలపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్పేస్‌లోకి ప్రవేశించింది. ఇకపోతే.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ నటిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్‌ నటించాడు. బ్రోలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ నటించింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. 
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం కోసం సుజీత్ దర్శకత్వంలో ఓజి అనే చిత్రంలో నటించనున్నాడు. 
 
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం 2024 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.