శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (17:05 IST)

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

Producers with pawan
Producers with pawan
తెలుగు సినిమాలోని అగ్ర నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ ను నేడు విజయవాడలో కలిశారు. కానీ సినిమా సమస్యలు ఏవీ చర్చకు రాలేదనీ, మరోసారి చర్చకు ఆహ్వానించారని పవన్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధి తెలియజేశారు. కాగా, ప్రభాస్, అశ్వనీదత్ సినిమా కల్కి సినిమా ఈనెల  27 న విడుదలకాబోతుంది. కొద్దిరోజులు మరో అగ్రహీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. టికెట్ల రేట్ల గురించి ప్రస్తావన వచ్చిందని తెలిసింది. కానీ ఆ విషయాలు ఇంకా ప్రకటించలేదు.

గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ తెలియచేశారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు.
 
సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, నిర్మాతలు శ్రీ సి.అశ్వనీదత్, శ్రీ ఎ.ఎం.రత్నం, శ్రీ డి.సురేష్ బాబు, శ్రీ ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ భోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ, శ్రీ వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.