శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (13:49 IST)

ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహం పై సలార్ సీజ్ ఫైర్ నుంచి పాట విడుదల

Prabhas, Prithviraj Sukumaran
Prabhas, Prithviraj Sukumaran
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

రీసెంట్‌గా విడుద‌లైన ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. దీంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఆకాశాన్నంటింది. ఇప్పుడు దీన్ని మ‌రో మెట్టు పెంచేలా ఈ చిత్రం నుంచి ‘సూరీడే..’ అనే లిరికల్ సాంగ్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు. 
 
Song link - https://youtu.be/rrXvdEMHVXc
 
గూజ్ బ‌మ్స్ తెప్పించే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న సలార్ సీజ్ ఫైర్‌లో స‌లార్ మ్యూజిక‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి అందరినీ తీసుకెళ్లారు. అందులో భాగంగా ‘సూరీడే..’ పాటను తొలి పాటగా విడుదల చేయటంపై ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు హ్య‌పీగా ఫీల్ అవుతున్నాయి. 
 
లిరిక్స్ వింటుంటే హృద‌యాన్ని హత్తుకునే భావోద్వేగాలు క‌నిపిస్తున్నాయి. ఇది సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంద‌ని, ఒకే ఆత్మ అనేలా ఉండే ఇద్ద‌రి స్నేహితులు గురించి ఈ పాట చెబుతుంది. వారే ఒక‌రికొకరు బ‌లం.. వారే ఒక‌రికొక‌రు బ‌ల‌హీన‌త అని పాట వివ‌రిస్తుంది. ర‌వి బస్రూర్ సంగీత సార‌థ్యంలో హ‌రిణి వైతూరి పాడిన ఈ సాంగ్‌ను కృష్ణ‌కాంత్ రాశారు. 
 
 స‌లార్ సీజ్ ఫైర్ కేవ‌లం యాక్ష‌న్ సినిమాయే కాదు..అంత‌కు మించి ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంటుంద‌ని ఆడియెన్స్‌కి క్లియ‌ర్‌గా తెలుస్తోంది. స‌లార్ సీజ్ ఫైర్ సెన్సార్ పూర్తి చేసుకుని ఏ స‌ర్టిఫికేట్‌ను పొందింది. 2 గంట‌ల 55 నిమిషాల వ్య‌వ‌ధితో ప్రేక్ష‌కులను అల‌రించ‌నుంది. 
 
డిసెంబ‌ర్ 22న హోంబలే సంస్థ ఇప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.