Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ
Prabhas, Sandeep Reddy Vanga
ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ పేరుతో స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో చిత్ర నిర్మాతలు విడుదల చేసింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ ప్రోమో.. ఐ.పి.ఎస్ ఆఫీసర్ సెంట్రల్ జైలుకు రావడం.. అక్కడ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ మాట్లాడే పరుషమైన డైలాగ్ లతో మెడికల్ టెస్ట్ కు పంపించండి అంటూ అంటాడు. అనంతరం మిస్టర్ సూపరిడెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఓ బ్యాడ్ హ్యాబిట్ వుంది.. అంటూ ప్రభాస్ డైలాగ్ తో ఎండ్ అవుతుంది. ఇలా కథను కొద్దిగా రిలీవ్ చేసి అభిమానుల్లో క్రూరియాసిటీని నెలకొల్పారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని రెబల్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రెండు కొత్త అప్ డేట్స్ కూడా వుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ తనయుడు మహాధన్ భూపతిరాజు, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ లు ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.