శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (16:02 IST)

బాక్సాఫీస్ వద్ద వైల్డ్‌ఫైర్ బ్లాస్ట్... 4 రోజుల్లో 'పుష్ప-2' రూ.829 కోట్లు వసూలు

pushpa-2 movie
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో పొందిన "పుష్ప-2" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్లుంది. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్టు మేకర్స్ సోమవారం అధికారికంగా ఓ పోస్టరు ద్వారా ప్రకటించారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, బన్నీ ఊర మాస్ స్టెప్పులు ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 
మరోవైపు బాలీవుడ్‌లో రికార్డులను తిరగరాస్తుంది. విడుదలైన నాలుగో రోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ.86 కోట్లు వసూలు చేసింది. హిందీలో అత్యధిక సింగిల్ డే వసూళ్లు సాధించిన సినిమాగా 'పుష్ప-2' నిలిచింది. 
 
ఈ చిత్రం వైల్డ్ ఫైర్ బ్లాక్‌బస్టర్ అని కేవలం నాలుగు రోజుల్లోనే హిందీలో అత్యంత వేగంగా రూ.291 కోట్లు (నెట్) సాధించిన హిందీ సినిమాగా అవతరించింది. హిందీ వెర్షన్ తొలి రోజున రూ.72 కోట్లు, రెండో రోజున రూ.59 కోట్లు, మూడో రోజున రూ.74 కోట్లు చొప్పున వసూలు చేసిన విషయం తెల్సిందే. 
 
ఇక మొత్తంగా చూసుకుంటే 'పుష్ప-2' విడుదలైన నాలుగు రోజుల్లో రూ.829 కోట్ల(గ్రాస్) సాధించింది. ఈ చిత్రం రెండు మూడు రోజుల్లోనే రూ.1000 కోట్లు దాటడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.