శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (13:21 IST)

Janhvi Kapoor Supports 'Pushpa 2' మన చిత్రాలను మనమే తక్కువ చేసుకుంటున్నాం.. 'పుష్ప-2' ట్రోల్స్‌పై జాన్వీ కపూర్ ట్వీట్

jhanvi kapoor
Janhvi Kapoor Supports 'Pushpa 2' 'పుష్ప-2' చిత్రానికి ఉత్తరాదిలో అధిక సంఖ్యలో థియేటర్లు కేటాయించారు. పుష్ప-2 కారణంగా హాలీవుడ్ చిత్రం ఇంటర్‌స్టెల్లార్ చిత్రం వాయిదాపడింది. పుష్ప రీలీజ్ కారణంగా హాలీవుడ్ చిత్రానికి అధిక సంఖ్యలో థియేటర్లను కేటాయించలేదు. దీంతో చిత్రం విడుదలను వాయిదా వేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికా ట్రోల్స్ వస్తున్నాయి. వీటిపై హీరోయిన్ జాన్వీ కపూర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. 
 
'పుష్ప-2' కూడా ఒక సినిమానే కదా. ఎందుకు దాన్ని మరొక మూవీతో పోలుస్తూ తక్కువ చేస్తున్నారు. మీరు ఏదైతే హాలీవుడ్‌ సినిమాను సపోర్ట్‌ చేస్తున్నారో వారే మన సినిమాలపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇటువంటివి చూసినప్పుడు బాధగా ఉంటుందని' అని పేర్కొన్నారు. 
 
ఇక హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌ దర్శకత్వం వహించిన 'ఇంటర్ స్టెల్లార్' చిత్రం 2014లో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 'ఇంటర్​ స్టెల్లార్' ఐమ్యాక్స్ వెర్షన్‌ను రీరిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఎక్కువ శాతం థియేటర్స్‌ను 'పుష్ప 2' కేటాయించటం వల్ల భారత్‌లో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.