శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (17:21 IST)

వెన్నునొప్పితో బెడ్ పైనే రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh
Rakul Preet Singh
నటి  రకుల్ ప్రీత్ సింగ్ హెల్త్ అప్ డేట్ రిలీజ్ చేసింది. బెడ్ పై పడుకుని తన ఆరోగ్యం గురించి వివరించింది. జిమ్ లో సరైన ప్రికాషన్స్ లేకుండా చేయడం వల్ల వెన్ను నొప్పి వచ్చిందని తెలియజేస్తుంది. బెల్ట్ లేకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వెన్నునొప్పితో బాధపడింది. ఆమె తన హెల్త్ అప్‌డేట్ ఇస్తూ, నాగురించి వాకబు చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. దీనిపై కొందరు తేలికగా తీసుకోండి మరియు మరింత బలంగా తిరిగి రండి అంటూ నాకు పోస్ట్ చేశారు. 
 
దీపావళికి నేను బయటకు రాలేనని బాధపడుతున్నాను. బెల్ట్ లేకుండా 60 కిలోల డెడ్‌లిఫ్ట్‌ని ఎత్తడానికి ప్రయత్నించా. 60 కేజీలు ఎత్తడం నా మొదటిసారి కానప్పటికీ ఈసారి నా దురదృష్టం అని పేర్కొంది. గతంలో ఎన్నిసార్లు లిఫ్ట్ చేసినా జరగనిది ఈసారి జరిగింది. అయినా త్వరలో కోలుకుని ముందుకు వస్తానని చెప్పింది. భారతీయుడు 2 సినిమా తర్వాత రకుల్ మరలా సినిమా చేయలేదు.