శుక్రవారం, 10 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2025 (18:26 IST)

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

Peddi song at shoioting spot
Peddi song at shoioting spot
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
 
రేపు పూణేలో ప్రారంభమయ్యే నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కోసం టీం సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారు. అకాడమీ అవార్డు విన్నర్ మాస్ట్రో AR రెహమాన్ అదిరిపోయే సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ సాంగ్ కి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుంది.
 
సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ పాషన్ తో పనిచేస్తోంది.
 
రామ్ చరణ్ తన పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.   
 
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న పెద్ది గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.
 
తారాగణం: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ