మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2025 (13:28 IST)

Ram Charan :పెద్ది నుంచి రామ్ చరణ్ బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ రిలీజ్

Peddi new mass poster
Peddi new mass poster
రామ్ చరణ్ సినీప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంలో తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే "పెద్ది"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. IVY ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రానికి కో-ప్రెజెంటర్‌గా, కో-ప్రొడ్యూసర్‌గా చేరింది. 
 
చిరుత సినిమాతో తన బ్లాక్‌బస్టర్ అరంగేట్రం చేసిన చరణ్ పరిశ్రమలో 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చరణ్ ని అద్భుతమైన మాస్, ఇంటెన్స్ లుక్‌లో ప్రజెంట్ చేస్తోంది. రైల్వే ట్రాక్‌పై ఒంటరిగా నిలబడి, భుజంపై బ్యాక్‌ప్యాక్ వేసుకుని, వేళ్ల మధ్య బీడీతో చరణ్ మాస్ వైబ్‌ అదిరిపోయింది. 
 
ఈ పోస్టర్‌ ఓ లేయర్‌ మాత్రమే. సినిమాలో చరణ్‌ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. ప్రతి లుక్ వెనుక ఎమోషన్ పీక్ లో ఉండబోతోంది. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇంటెన్స్ ప్రిపరేషన్‌, ఇమర్షివ్ ట్రైనింగ్ ఆయన డెడికేషన్‌కి నిదర్శనం. 
 
ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల అవుతుంది.
ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, రామ్ చరణ్, ఇతర ప్రధాన తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
 
పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. 
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ