శుక్రవారం, 17 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2025 (13:12 IST)

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

Prabhas, Salaar Re-Release
Prabhas, Salaar Re-Release
ఒక మనిషి. ఒక్క ఆవేశం. ఇంకోసారి. రాబోతుందంటూ.. రెబల్‌స్టార్ ప్రభాస్  సాలార్ రి రిలీజ్ కు సిద్దమైందని చిత్ర యూనిట్ పోస్టర్ ను విడుాదల చేసింది. సలార్ సీజ్ ఫైర్ చిత్రాన్ని 23 అక్టోబర్ 2025న ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నారు.
 
పృథ్వీ, శ్రుతిహాసన్ నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకుంది, వసూళ్ళపరంగా ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత ప్రభాస్.. చేస్తున్న రాజా సాబ్ తోపాటు మరో రెండు సినిమాలు లైన్ లో వున్నాయి. ఈ లోగా సలార్ రిలీజ్ ను చేయనున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ గా కూడా ప్లాన్ చేస్తున్నారు. కథానాయిక ఇంకా ఫైనల్ కాలేదు.
 
చిన్నతనంలోని స్నేహితులు పెద్దయ్యాక మాఫియా సామ్రాజాన్ని స్థాపించే క్రమంలో ఎదురైన అడ్డంకుల నేపథ్యంగా దర్శకుడు డీల్ చేశాడు. మరి సీక్వెల్ ఎటువంటి లైన్ వుంటుందనే చెప్పలేదుకానీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. హోంబలే ఫిలిమ్స్ చిత్రాన్ని నిర్మించింది.