బుధవారం, 26 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (18:01 IST)

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

Keerthy Suresh, Ajay Ghosh
Keerthy Suresh, Ajay Ghosh
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ నిర్వహించారు.
 
కీర్తి సురేష్ మాట్లాడుతూ..  అజయ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఇందులో సునీల్ గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారు. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో రాధిక గారు చాలా చక్కని పాత్ర చేశారు. మా ఇద్దరికి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిలిం. ఇప్పటివరకు చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ ఇది ఫిమేల్ లీడ్ చేస్తున్న డార్క్ కామెడీ ఫిలిం. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. 
 
ఇది ఒక్క రోజులో జరిగే కథ. చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ఇందులో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.షాన్ రోనాల్డ్  చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు.  మా డిఓపి ప్రతి ఫ్రేం ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చంద్రు గారు ఈ సినిమాని పక్కా కమర్షియల్ సినిమా గా తీశారు. తప్పకుండా ఈ సినిమా ధియేటర్స్ లో మిమ్మల్ని అందరిని అలరిస్తుంది. నన్ను రీటాగా అద్భుతంగా చూపించిన డైరెక్టర్ చంద్రు కి థాంక్యూ. అలాగే మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. వాళ్ళు మహారాజా లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. ఈ సినిమాల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు కన్నడలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కుమార్ గారికి థాంక్యూ. 28న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
 
డిస్ట్రిబ్యూటర్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నవంబర్ 28న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా. కీర్తి గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే అజయ్ గారు సునీల్ గారు అందరు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఆల్రెడీ చూసాము .చాలా బాగుంది. ఈ సినిమాని ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేసుకునే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంచి సినిమా తప్పకుండా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
 
అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రంగస్థలం పుష్ప తర్వాత అంత ఆనందంగా అనిపించిన సినిమా ఇది.  మహానటి సావిత్రి గారి పాత్రలో నవరసాలు పండించిన కీర్తి సురేష్ గారితో  కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సమంత గారు కీర్తి సురేష్ గారు వీళ్ళిద్దరే నాకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోయిన్స్. కీర్తి గారు ఎంతో నమ్రతతో ఉంటారు. షూటింగ్ చివరి రోజు స్వయంగా ఆమెనే పిలిచి ఫోటోలు తీసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా అద్భుతమైన కథ. డైరెక్టర్ చంద్రు గారు చాలా అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో కీర్తి గారు యాక్షన్ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఒక కొత్త సునీల్ గారిని చూస్తారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
 
నటీనటీనటులు కీర్తి సురేష్, రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ, జాన్ విజయ్, కళ్యాణ్ మాస్టర్, సురేష్ చక్రవర్తి, కతిరవన్, సెంద్రాయన్, అగస్టిన్, బ్లేడ్ శంకర్, రామచంద్రన్, అక్షత అజిత్, కుహాసిని, గాయత్రీ షాన్