శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:49 IST)

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Roshan Kanakala, Sandeep Raj,  Sakshi Sagar Madolkar
Roshan Kanakala, Sandeep Raj, Sakshi Sagar Madolkar
సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో రాబోతున్నారు. మోగ్లీ 2025 టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి సాగర్‌ మదోల్కర్‌ నటిస్తున్నారు.
 
మోగ్లీ 2025 మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రోషన్ కనకాల, సాక్షి సాగర్ మదోల్కర్‌లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి సందీప్ రెడ్డి వంగా క్లాప్‌ ఇచ్చారు, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.
 
రోషన్ కనకాల ఛార్మింగ్ గా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మోగ్లీ 2025 టైటిల్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
 
మోగ్లీ 2025కి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కలర్ ఫోటో కు సక్సెస్ ఫుల్ సౌండ్‌ట్రాక్స్ అందించిన కాల భైరవ సంగీతం సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2, RRR వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లలో చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రామ మారుతి ఎమ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కలర్ ఫోటో, మేజర్, అప్ కమింగ్ గూడాచారి 2 చిత్రాలకు పని చేసిన పవన్ కళ్యాణ్ ఎడిటర్.