శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2024 (21:50 IST)

అక్టోబర్ 25న రాబోతోన్న "నరుడి బ్రతుకు నటన".. సక్సెస్ చెయ్యండి ప్లీజ్

Narudi Brathuku Natana
Narudi Brathuku Natana
శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. 
 
టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్. ఈ మూవీ అక్టోబర్ 25న రాబోతోంది. 
 
ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక షెరు వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 
 
అనంతరం..
 
 సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘టీజీ విశ్వ ప్రసాద్ గారిని పదేళ్ల క్రితం కలిశాను. ఆయన అప్పటికి ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. ఈ మూవీ ట్రైలర్ చూశాను. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. 
 
నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. నేను కృష్ణవంశీ చిత్రానికి, బాఘీ చిత్రాలకు ఆడిషన్స్ చేశాను. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. 
 
ఈ మూవీ చాలా కొత్తగా, రీఫ్రెషింగ్‌గా ఉండబోతోందనిపిస్తోంది. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
 
 
టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. అవి ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ప్రదర్శించగలిగాను. కానీ థియేట్రికల్ రిలీజ్ చేయలేకపోయాను. ఈ ‘నరుడి బ్రతుకు నటన’ టీంని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అందుకే వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి టీంను సపోర్ట్ చేయండి’ అని అన్నారు. 
 
 
 
డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను టేకప్ చేసిన టీజీ విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన సుదీర్ బాబు గారికి, శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. శివ, నితిన్ వంటి యాక్టర్లు లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీంకు థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 25న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
 
శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘శివ, నితిన్‌లు చక్కగా నటించారు. ట్రైలర్ చూశా. నాకు చాలా నచ్చింది. అందరూ ఇంటెన్స్‌గా నటించారు. విశ్వ ప్రసాద్ గారు ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. అక్కడే ఈ మూవీ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. వర్షం పడితే వచ్చే మట్టి వాసనలా ఈ సినిమా అనిపిస్తోంది. అందరూ ఈ సినిమాను కచ్చితంగా చూడండి’ అని అన్నారు.
 
 
 
వీజే సన్నీ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయోగాన్ని అందరూ ఆదరించాలి. ఇలాంటి చిత్రాలను ఆడియెన్స్ ఆదరించినప్పుడు ఇంకా కొత్త ప్రయోగాలు చేసేందుకు అందరూ ముందుకు వస్తుంటారు. టీజీ విశ్వ ప్రసాద్ వంటి వారు ఇలాంటి ఓ డిఫరెంట్ మూవీని ఎంచుకుని, సాయం చేయడం ఆనందంగా ఉంది. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
 
 
శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే.. నేషనల్ అవార్డు కూడా వస్తుంది. మొదట్లో చిన్న చిత్రంగా స్టార్ట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ రాకతో రూపురేఖలు మారిపోయాయి. అక్టోబర్ 25న మా సినిమాను చూడండి. మీతో పాటుగా నన్ను, నితిన్‌ను ఇంటికి తీసుకెళ్తారు’ అని అన్నారు.
 
 
 
నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ‘మేం మా దర్శకుడు రిషిని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ని చేశాం. షార్ట్ ఫిల్మ్స్ చేసే టైం నుంచి రిషి నాకు తెలుసు. ఈ మూవీ చిన్నగా స్టార్ట్ అయింది. ఏ రోజు జరిగిన షూట్‌ని ఆ రోజే ఎడిట్ చేసి మాకు చూపించేవాడు. ఆయన చాలా టాలెంటెడ్. కంటెంట్‌ను నమ్మి మా నిర్మాతలు చిత్రాన్ని నిర్మించారు. విశ్వ ప్రసాద్ గారి రాకతో ఈ ప్రాజెక్ట్ స్థాయి పెరిగింది. ప్రీమియర్లలో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
 
 
నిర్మాత డా. సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమాను ప్రెజెంట్ చేస్తున్న విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్. మా మూవీ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సుధీర్ బాబు గారికి థాంక్స్. రిషికి మంచి టాలెంట్ ఉంది. శివ చక్కగా నటించాడు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీని చూసి కంటెంట్ నచ్చి విశ్వ ప్రసాద్ గారు ముందుకు వచ్చారు. మేం ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెల్ప్ దొరికింది. అందుకే ఇక్కడి వరకు వచ్చాం. అక్టోబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.