SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?
తెలుగు సినిమా ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులకు వేదిక. ఒక అప్ కమింగ్ మూవీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్తవారు ఉన్నారు. స్టార్ కంపోజర్ ఎస్. థమన్ ఈ ప్రాజెక్ట్ కోసం సంగీతం అందిస్తున్నారు. స్టార్ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ఎక్సయిట్మెంట్ రేకెత్తించారు. ఈసారి #NewGuyInTown అనే హ్యాష్‌ట్యాగ్ తో ట్వీట్ చేసి ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచారు.
హ్యాష్‌ట్యాగ్‌తో పాటు “అతను పెద్దగా మాట్లాడడు. కానీ అతని రాక సౌండ్ చేస్తుంది' అనే టీజర్ లైన్ పరిశ్రమలో మిస్టీరియస్ న్యూ ఫేస్ రాకను సూచిస్తుంది. సినిమా అభిమానులు కొత్త వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. న్యూ ఫేస్ తెలుగు సినిమాలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి. థమన్ కుటుంబలో వ్యక్తి కావచ్చు అని తెలుస్తోంది.
నిర్మాణ సంస్థ ప్రకారం, ఈ చిత్రం కొత్త తారాగణం, సిబ్బందితో కూడిన న్యూ ఏజ్ ప్రాజెక్ట్. ప్రేమ, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది.
తారాగణం, సిబ్బంది వివరాలు త్వరలో రివిల్ చేస్తామని టీం చెబుతోంది. టైటిల్, గ్లింప్స్ డిసెంబర్ 14న విడుదల కానుంది.