బుధవారం, 19 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 17 నవంబరు 2025 (15:51 IST)

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

Singeetam srinivas, devisri prasad, nag aswin
Singeetam srinivas, devisri prasad, nag aswin
సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ లు వైవిధ్యమైన దర్శకులు. సింగీతం దర్శకుడిగా పలు విజయవంతమైన సినిమాలు చేశారు. ఆదిత్య 369 వంటి టైం ట్రావల్ సినిమా ట్రెండ్ సెట్టర్ అయింది. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన మరలా మరో సినిమాకు నడుం కట్టినట్లు తెలుస్తోంది. ఇక నాగ్ అశ్విన్ .. మహానటి, కల్కి వంటి సినిమాలతో తెలుగు సినిమా రంగంలోనే సరికొత్త పోకడలకు మార్గం వేశారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం సన్నాహాలు జరుపుకుంటోంది.
 
వీరిద్దరి కలిసి కొత్త ప్రయోగాత్మక చిత్రం కోసం జతకట్టనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, ఇందులో ఎక్కువగా కొత్త ముఖాలు ఉంటాయి. సింగీతం యొక్క ప్రత్యేక శైలిలో ఉత్తేజకరమైన సమయాలు ముందుకు ఉన్నాయి. కాగా, ఈ సినిమాకు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అది ఏమిటనేది త్వరలో తెలియజేయనున్నారు.