శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (14:18 IST)

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

srireddy
నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరులో తెలుగు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరులో తూర్పు గోదావరి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరంగా వీడియోలు, పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమండ్రి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోం మంత్రి అనితల గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, అనంతపురానికి చెందిన తెలుగు మహిలా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కూడా బుధవారం నాలుగో పట్టణ పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమెపై మరో కేసు నమోదైంది.