శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:42 IST)

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది

Bagheera look
Bagheera look
కన్నడ నటుడు ఉగ్రమ్ ఫేమ్  శ్రీమురళి అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ బగీరాతో రాబోతున్నారు. ఉగ్రమ్, కెజిఎఫ్, సాలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు. KGF 1, కాంతారా, సాలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఉత్కంఠభరితమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.
 
బఘీరాలో రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి వారు నటిస్తున్నారు.  ఎజె శెట్టి కెమెరా, బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్, రవి సంతేహక్లు ఆర్ట్ డైరెక్టర్.
 
థ్రిల్లింగ్ యాక్షన్, పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్‌ని మిళితం చేసి, కన్నడ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్ అవుతుందని బగీరా ​​వుంటుందని చిత్రయూనిట్ చెబుతోంది.  ఇటీవలి కాలంలో పలు బ్లాక్‌బస్టర్‌లను చిత్రాలను పంపిణీ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
 
దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బగీరా ​​చిత్రం విడుదల కానుంది. పోస్టర్లు సూచించినట్లుగా, శ్రీమురళి సినిమాలో ఘాటైన మరియు పవర్-ప్యాక్డ్ పాత్రను పోషించారు. తెలుగు ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రం మొదటి సింగిల్ రుధిర హార అక్టోబర్ 17న ఉదయం 10:35 గంటలకు విడుదల కానుంది.
 
తారాగణం: శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, తదితరులు