బుధవారం, 20 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2025 (19:33 IST)

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

Ram Charan, stylist Aalim Hakeem family, Buchi Babu Sana
Ram Charan, stylist Aalim Hakeem family, Buchi Babu Sana
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'లో ఇప్పటివరకూ ఎన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  
 
రామ్ చరణ్ పెద్దిలో నెవర్ బిఫోర్ లుక్‌తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యారు. టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీం హకీం, రామ్ చరణ్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని సరికొత్త లుక్ లో ప్రెజంట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ స్టైల్, స్వాగ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేయనున్నారు.
 
రీసెంట్ గా స్టైలిస్ట్ ఆలీం హకీం, రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
 
రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల కానున్న పెద్ది, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది.  
 
ఈ చిత్రం నుంచి కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవల అతని పుట్టినరోజున విడుదలైంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీగా పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.    
 
రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27, 2026న ఈ చిత్రం విడుదల కానుంది.
 
నటీనటులు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సన
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా