బుధవారం, 12 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 12 మార్చి 2025 (17:48 IST)

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

Surender Reddy, Venkatesh
Surender Reddy, Venkatesh
అల్లు అర్జున్ తో రేసు గుర్రం తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తర్వాత  అఖిల్ అక్కినేనితో ఏజెంట్ తీసి ప్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం ఎక్కడా కనిపించలేదు. ఏజెంట్ విడుదలకుముందు ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోదే. ప్లాప్ అయితే నాది అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ఇంతకాలానికి సురేందర్ రెడ్డి మరలా సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
విశ్వసనీయ సమాచారం మేరకు విక్టరీ వెంకటేష్ తో సినిమా ఆరంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫిలింసిటీలో ఈ మేరకు షూటింగ్ జరుగతుందని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ ను ఇంచుమించు ఎంటర్ టైన్ మెంట్ తో చూపించాలని సురేందర్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, పూజా హెగ్డే నాయికలుగా ఎంపికయ్యారట. కొంతకాలం గేప్ తర్వాత నల్లమలుపు బుజ్జి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.