శుక్రవారం, 5 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (13:09 IST)

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

pakistan plane
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పీకల్లోతు ఆర్థిక కష్ట్రాల్లో చిక్కుకుంది. దీంతో ఈ విమాన సంస్థకు అమ్మకానికి పెట్టింది. క్రమంగా ప్రైవేటీకరించి అమ్మేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ఈ విమానయాన సంస్థలో 51 శాతం నుంచి 100 శాతం వాటాల అమ్మకానికి ఈ నెల 23న బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం స్పష్టం చేశారు.
 
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ పొందేందుకు పీఐఏ ప్రైవేటీకరణ అనేది ఒక ప్రధాన షరతుగా ఉంది. గత రెండు దశాబ్దాల్లో పాకిస్థాన్‌లో జరుగుతున్న అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియ ఇదే కావడం గమనార్హం. ఈ బిడ్డింగ్ కోసం నాలుగు కంపెనీలు అర్హత సాధించాయి. వాటిలో లక్కీ సిమెంట్ కన్సార్టియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం, ఎయిర్ లిమిటెడ్తో పాటు పాక్ సైన్యం నియంత్రణలో ఉండే 'ఫౌజీ ఫౌండేషన్'కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉండటం చర్చనీయాంశమైంది.
 
సంవత్సరాలుగా ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ నియామకాలతో పీఐఏ భారీ నష్టాల్లో కూరుకునిపోయింది. 2020లో 30 శాతం మంది పైలట్లు నకిలీ లైసెన్సులతో విమానాలు నడుపుతున్నారనే కుంభకోణం బయటపడటంతో సంస్థ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింది. 
 
ఈ కారణంగా యూరప్, అమెరికా, యూకే వంటి దేశాలు పీఐఏ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో సంస్థ ఆర్థికంగా మరింత కుదేలైంది. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్న పాకిస్థాన్, ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి పెట్టింది.