శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2024 (14:59 IST)

మా నాన్న చేసిన తప్పు అదే : మంచు విష్ణు స్టేట్ మెంట్

Manchu Vishnu
Manchu Vishnu
మా కుటుంబంలో బయటి వ్యక్తుల ఇన్ వాల్వ్ మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాం. లేదంటే అందరి పేర్లు నేనే  బయడపెడతాను.‌ ఇలాగ మాట్లాడాల్సి వస్తుంది.. ఇలాంటి సిట్యువేషన్ మాకు వస్తుందని ఊహించలేదు అని మంచు విష్ణు అన్నారు. ఈరోజు ఓ ఫంక్షన్ కు అటెండ్ అయిన ఆయన తన కుటుంబ విషయాలగురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
 
ఇంకా మాట్లాడుతూ, ఇల్లు మాకు దేవాలయం. మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కొట్టినా తిట్టినా నేను పడతాను. తను నా అక్క ఇది మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. మూడు తరాలుగా  నాన్నగారు ఏంటి అనేది మీకు తెలుసు.. ప్రతి ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి.‌ అవి రిజాల్వ్ అవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను  ఎమోషనల్ పెయిన్ ఫుల్ గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం..
 
మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు. మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు జరిగాయి. నేను లాస్ ఎంజెల్స్ లో కన్నప్ప వర్క్ లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి .. అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా పర్సన్ కు గాయాలు తగలటం బాధాకరం.. ఇంటెన్షనల్ గా చేసింది కాదు.. నాన్నగారు మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. కానీ షడెన్ గా మోహం మీద ఎదో పెట్టారని .. అలా జరిగిపోయింది. పోలీసులు మా కంటే ముందు మీడియాకు నోటీసులు లీక్ అవుతున్నాయి. నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను..
 
ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు..మనోజ్ ఆరోపణలపై నేను చెప్పెది ఏమి లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను.. నేను ఇక్కడ ఉంటే .. ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు.. తమ్ముడు బిడ్డను కన్నారు. చక్కగా ఫంక్షన్ చేసుకున్నాం.  అయితే నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం.. ఎంతో కష్టపడి స్వయం కృషి తో గొప్ప స్దాయికి ఎదిగారు. మాకిచ్చే లభించే  గౌరవం ఆయనవల్లే.. మోహన్ బాబు పిల్లలుగానే‌ పేరు తెచ్చుకున్నాం. కుటుంబం పరంగా నాన్న గారు ఏది అనుకుంటే అదే ఉండాలి. తల్లిదండ్రులను రెస్పెక్ట్  చేయాలి.. మీడియా లో కొంతమందే హద్దు మీరుతున్నారు.. అందరూ కాదు. కానీ సోసైటీలో కొందరు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ చెస్తున్నారు.
 
ఇక వినయ్ గారు నాకు అన్న లాంటి వారు.. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలా..వినయ్ కు నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది.. ఇండియాలోనే  గొప్ప స్థాయి ఉన్న వ్యక్తి.. నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పాలంటే.. లోపల తండ్రి స్థాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా.‌. తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటి పెరెన్నిక గలది..
 
ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీలను తీసుకువచ్చే ఘనత మాదే అవుతుంది. మోహన్ బాబు గారిని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అది మాకు దేవాలయం.. మా నాన్న చెప్పిందే నాకు వేద వాక్కు .. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనెప్పుడు దాడులు చేయను..
 
నా సినిమా , మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను‌.. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను.. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు. సమయమే అన్ని ప్రాబ్లంస్ కు సమాధానం ఇస్తుంది అని తెలిపారు.