శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (20:45 IST)

మారుతీ నగర్ సుబ్రమణ్యం కోసం ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీలా నిలబడి సపోర్ట్ చేసింది : తబితా సుకుమార్

Ramesh, Indraja, babita and team
Ramesh, Indraja, babita and team
విలక్షణ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రానికి బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ వంటి వారు నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న విడుదలైంది. సినిమాకు మీడియా నుంచి మంచి రివ్యూలు, ఆడియెన్స్ నుంచి మంచి మౌత్ టాక్ రావడంతో యూనిట్ అంతా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను చేసుకుంది. 
 
ఈ క్రమంలో శనివారం నిర్వహించిన థాంంక్స్ మీట్‌ ఈవెంట్‌లో తబితా సుకుమార్ మాట్లాడుతూ.. ‘చంద్రబోస్, వాయిస్ ఓవర్ ఇచ్చిన మా ఆయన సుకుమార్ గారికి థాంక్స్. నన్ను నమ్మి, నాకు సపోర్ట్‌గా నిలిచిన సుకుమార్ గారికి థాంక్స్. మొదట్లో ఈ సినిమాకు కేవలం సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ మూవీని ప్రజెంట్ చేద్దామనే ఆలోచన అయితే లేదు. కానీ ఈ మూవీని చూసిన తరువాత ఇలాంటి ప్రాజెక్ట్ జనాల్లోకి బాగా వెళ్లాలని అనుకున్నా. నేను మూవీని చూసి ఎంత ఎంజాయ్ చేశాను.. ఎంత నవ్వుకున్నాను.. ఎంత సంతోషించానో.. జనాలు కూడా అదే ఫీల్ అవ్వాలని అనుకున్నాను. అందుకే ఈ మూవీని ప్రజెంట్ చేసేందుకు ముందుకు వచ్చాను. రామ్ చరణ్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించండి అని ఉపాసన గారికి మెసెజ్ పెట్టాను. నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నా.. ట్రైలర్ చూడండి అని నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. సమంత, స్వప్నా దత్, రష్మిక, నవీన్ పొలిశెట్టి వంటి వారు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీలా మాకు సపోర్ట్‌గా నిలిబడింది. ఈ సినిమాలోని కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నాను. పుష్ప క్లైమాక్స్ షూట్‌లో ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయి ఉన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. ఆయన రావడం వల్లే సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది. మైత్రీ శశి గారు ముందుకు వచ్చి మాకు సపోర్ట్‌గా నిలిచారు. హరి, శశి, రవి, అశోక్, శ్రీనివాస్, వేమ ఇలా అందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మా సినిమాకు వస్తున్న ఫలితాన్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఏం ఊహించానో అదే నిజమైంది. నా జడ్జ్మెంట్ కరెక్ట్ అని చెప్పిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. థియేటర్లో మా సినిమాను చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో వస్తుంది కదా అని ఎదురుచూడకండి. థియేటర్లో మా సినిమాను చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
రావు రమేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు మీడియా నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. మంచి రివ్యూలు వచ్చాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. ఇంద్రజ గారి నటన చూసి షాక్ అయ్యాను. ఇంద్రజ గారి డ్యాన్స్, ఆ ఎనర్జీకి దండం పెట్టాల్సిందే. అంకిత్ కొయ్య చాలా మంచి నటుడు. పాత్రకు కరెక్ట్‌గా సరిపోయాడు. మా ఇద్దరి మధ్య మంచి సీన్లు ఉంటాయి. తెలుగులో మంచి నటుడిగా ఎదుగుతాడు. ఒకే నెలలో మూడు చిత్రాలు పడ్డాయి. సింగిల్ టేక్‌లో నటించేస్తాడు. రమ్య పసుపులేటి అద్భుతంగా నటించారు. అన్నపూర్ణమ్మ గారు చాలా సీనియర్ నటి. ఆమెతో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. హర్షవర్దన్ గారు, ప్రవీణ్, శివన్నారాయణ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అలా లక్ష్మణ్ గారు అన్ని పాత్రలను అద్భుతంగా రాశారు. కళ్యాణ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ స్క్రిప్ట్ ఎంచుకోవడం తప్పా? అని అనుకున్నాను. మిడిల్ క్లాస్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతుంది. వాళ్లను కించపర్చకుండా ఈ సినిమాను లక్ష్మణ్ గొప్పగా తీశాడు. కామెడీ కోసం వాళ్లని కించపర్చకూడదు. ఈ సినిమా బ్యూటీ అదే. సింప్లిసిటీగా ఉండి.. బ్యూటీఫుల్‌గా సినిమాను తీయడం గొప్ప విషయం. ఈ సినిమాను ముందుకు నడిపించిన మోహన్, తబిత గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
 
డైరెక్టర్ లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. టికెట్లు సేల్ అవుతున్నాయి.. షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి.. మా సినిమాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తుంటే మా కడుపులు నిండినట్టుగా అనిపిస్తోంది. మౌత్ టాక్‌తో ఈ మూవీ ముందుకు వెళ్తుందని మాకు తెలుసు. ఫ్యామిలీ అంతా వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లేలా సినిమా ఉంటుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ సినిమా కోసం చాలా కొత్తగా ట్రై చేశాం. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి మా కష్టాన్ని మర్చిపోయాం. వాళ్ల రియాక్షన్స్ చూసి, వాళ్ల నవ్వుల్ని చూసి నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం చూసి నాకు చాలా రిలాక్స్డ్‌గా అనిపించింది. టీం అంతా కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. మా సినిమాను ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
 
రమ్య పసుపులేటి మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి ఆడియెన్స్ నుంచి, మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ మూవీకి, నా పాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందం వేసింది. సినిమాను చూసి నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫోన్‌లు చేశారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రావు రమేష్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇంద్రజ గారి పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.
 
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మీడియాకు థాంక్స్. నేను చాలా బాగా నటించాను అని అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ రావు రమేష్ గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను. రావు రమేష్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. షూట్ అయ్యాక రావు రమేష్ గారిని చాలా మిస్ అయ్యాను. కమిటీ కుర్రోళ్లు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యంతో ఈ ఆగస్ట్ నెల నాకు బాగా కలిసి వచ్చింది. కష్టమా? అదృష్టమా? అని కొందరు అడిగారు. నేను ఎంత కష్టపడినా.. కొందరి మంచితనం, కొంత అదృష్టం లేకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండేవాడ్ని కాదు. నేను అడగకపోయినా మాట సాయం చేసిన వారు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. మాట సాయం కావొచ్చు, డబ్బు సాయం కావొచ్చు.. భుజం తట్టిన వారు కావొచ్చు.. ఇలా చాలా మంది నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం.. ఈ సినిమా విషయంలో తబిత గారి మంచితనం మా అదృష్టం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
లైన్ ప్రొడ్యూసర్ శ్రీహరి మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీడియాకు థాంక్స్. రావు గారి ర్యాంపేజ్ అని అంటున్నారు.. లాఫింగ్ థెరపీ అని ప్రశంసిస్తున్నారు. మా సినిమాకు ఇంత మంచి ఆదరణ దక్కడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
 
ఇంద్రజ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఫ్యామిలీ మూవీకి ఇప్పుడున్న తరుణంలో థియేటర్లకు జనాలు వస్తారా? అనే అనుమానం ఉండేది. కానీ మంచి చిత్రాన్ని ఇస్తే సక్సెస్ చేస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన లక్ష్మణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రావు రమేష్ గారు తనతో నటించే వారందరికీ ఎంతో కంఫర్ట్ ఇస్తారు.. అందరినీ ఎంతో ప్రోత్సహిస్తుంటారు. ఇలాంటి మంచి పాత్రలు అంకిత్‌కు ఇంకా రావాలి.. మరింత సక్సెస్‌లు సొంతం చేసుకోవాలి. రమ్య పసుపులేటి ఎంతో చక్కగా నటించారు. ఏ మాత్రం యాటిట్యూడ్ చూపించదు. కళ్యాణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. తబిత గారి వల్లే ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.